ఆటో యూనియన్‌ నూతన కమిటీ ఎన్నిక

ఆటో యూనియన్‌ నూతన కమిటీ ఎన్నిక

NZB: ఆలూర్ మండల కేంద్రంలో ఆటో యూనియన్ నూతన కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడిగా తోగల్ల శాంతారాం, క్యాషియార్‌గా రాస కిరణ్‌ను కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు మాణిక్యం నారాయణ, బుస సాయిలు, బయ్యా నారాయణ, కొండికే శేఖర్, బీజ గంగాధర్, మధు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.