ఎలక్ట్రిక్‌ ట్రై సైకిళ్లను అందజేసిన ఎంపీ

ఎలక్ట్రిక్‌ ట్రై సైకిళ్లను అందజేసిన ఎంపీ

NLR: దివ్యాంగుల్లో ఆత్మ విశ్వాసం నింపేలా ఎలక్ట్రిక్‌ ట్రై సైకిళ్లను అందజేస్తున్నామని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శనివారం నగరంలోని వీపీఆర్‌ నివాసంలో ఐదు మంది దివ్యాంగులకు ఆయన ఎలక్ట్రిక్‌ ట్రై సైకిళ్లు అందించారు. ఇందులో కొండాపురం మండలం తూర్పు యర్రబల్లి గ్రామంలో 4 దివ్యాంగులకు, నెల్లూరు రూరల్‌ పరిధిలో ఒక వ్యక్తికి అందజేశారు.