పైడిమల్ సర్పంచ్ కాంగ్రెస్‌లో చేరిక
NZB: వర్ని మండలం పైడిమల్ సర్పంచ్ అనూష చిరంజీవి గురువారం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా గెలుపొందిన అనూష గురువారం ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ తీర్థ పుచ్చుకున్నారు. ఈకార్యక్రమంలో వర్ని మార్కెట్ కమిటీ ఛైర్మన్ సురేష్ బాబా, జడ్పీటీసీ మాజీ సభ్యుడు హరిదాసు, నాయకులు గంగాధర్ పాల్గొన్నారు.