విద్యుత్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి
E.G: సీతానగరం మండలం రామచంద్రపురం గ్రామంలో ఇవాళ విద్యుదాఘాతంతో పిర్ల పోశయ్య (38) అనే వ్యక్తి మృతి చెందాడు. పశువులకు మేత కోసం పచ్చగడ్డి కోసుకుని వస్తుండగా, కిందకు వేలాడుతున్న 11 కేవీ విద్యుత్ తీగలు తగలడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై అధికారులు విచారణ చేపట్టినట్లు తెలియజేశారు.