'ఉపాధ్యాయుల చేతుల్లోనే చిన్నారుల భవిష్యత్తు'

MNCL: ఉపాధ్యాయుల చేతుల్లోనే చిన్నారుల భవిష్యత్తు ఉందని జన్నారం మండల మార్కెట్ కమిటీ ఛైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం జన్నారంలోని జడ్పీ బాలుర పాఠశాలలో నిర్వహించిన మండల స్థాయి టిఎల్ఎం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. విద్యార్థులలో సృజనాత్మకతను ఉపాధ్యాయులు పెంపొందించాలన్నారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.