ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకోం: వెంకట్రామిరెడ్డి
ATP: హంద్రీనీవా ప్రాజెక్టు కోసం చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో కేవలం రూ.24 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. రాయలసీమ ప్రాజెక్టుల ఆవశ్యకతపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, వాస్తవాలు చెబుతుంటే వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. సీమ ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకోబోమని హెచ్చరించారు.