VIDEO: తిరుమల ఘాట్ రోడ్డులో కారు బోల్తా
TPT: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో సోమవారం ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారుకు బ్రేకులు పడకపోవడంతో 2వ కిలోమీటర్ మైలురాయి వద్ద బోల్తా పడింది. ఈ ఘటనలో తమిళనాడు భక్తులు స్వల్పంగా గాయపడ్డారు. రోడ్డుకు అడ్డంగా కారు పడిపోవడంతో కాసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. TTD అధికారులు, రక్షణ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.