'పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం'
GNTR: అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం తెలుగు జాతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా సోమవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.