ఈనెల 24న పెదకాకాని ఎంఆర్వో కార్యాలయం వద్ద నిరసన

ఈనెల 24న పెదకాకాని ఎంఆర్వో కార్యాలయం వద్ద నిరసన

GNTR: ఇళ్ల స్థలాల హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నేత సత్యనారాయణ మార్చి 24న పెదకాకాని తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. పట్టణాల్లో 2, గ్రామాల్లో 3 సెంట్ల స్థలాలు, గృహ నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పేదలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.