శ్రీకాళహస్తిలో ఎలక్షన్ స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించిన కలెక్టర్

చిత్తూరు: శ్రీకాళహస్తిలోని స్కిట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి అయిన డాక్టర్ లక్ష్మి షా, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అవసరమైన సదుపాయాల గురించి ఆరా తీశారు. భాస్కరపేట, ఊరందూరులోని ఎలక్షన్ కేంద్రాలను ఈ సందర్భంగా కలెక్టర్ తనిఖీ చేశారు.