అమరావతికి బయలుదేరిన కలిగిరి వాసులు

NLR: అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్నారు. సంబంధిత సభకు కలిగిరి వాసులు శుక్రవారం ప్రత్యేక వాహనాల ద్వారా బయలుదేరి వెళ్లారు. టీడీపీ మండల కన్వీనర్ బిజ్జం కృష్ణారెడ్డి, డిప్యూటీ ఎంపీడీవో వెలుగోటి మధు జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మండల సమాఖ్య మహిళలు బయలుదేరారు.