వారి రాక కోసమే ఎదురు చూపులు..!

వారి రాక కోసమే ఎదురు చూపులు..!

WG: నల్లజర్ల మండలం పోతవరంలో సచివాలయం-2లో సిబ్బంది నిర్లక్ష్యానికి ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. ఉదయం 11గంటలు దాటినా సచివాలయ సిబ్బంది విధులకు హాజరు కాలేదని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పని నిమిత్తం సచివాలయానికి వచ్చిన ప్రజలు.. సిబ్బంది రాక కోసం ఉదయం పడిగాపులు కాస్తున్నారు. దీనిపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాల్లన్నారు.