ఈ నెల 9న జాబ్ మేళా
VZM: డీఆర్‌డీఏ–సీడాప్ ఆధ్వర్యంలో ఈనెల 9న ఉదయం 9 గంటల నుంచి స్థానిక టీటీడీసీ మహిళా ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ పాణి సోమవారం తెలిపారు. వివిధ కంపెనీలలో మొత్తం 1960 ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరగనుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆధార్, విద్యార్హత సర్టిఫికెట్లు, బయోడేటా, ఫోటోలు తీసుకుని హాజరుకావాలని సూచించారు.