ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ
JGL: జగిత్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను డీఎస్పీ రఘుచందర్ సోమవారం తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణను, రికార్డ్‌లను పరిశీలించారు. అలాగే ట్రాఫిక్ పాయింట్ల వద్ద తీసుకోవలసిన జాగ్రత్తలు, విజిబుల్ పోలీసింగ్‌కు సంబంధించిన పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ సీఐ కరుణాకర్, ట్రాఫిక్ ఎస్సై మల్లేశ్ పాల్గొన్నారు.