బీహార్ కొత్త సీఎం పేరుపై నితీష్ సంకేతాలు!
బీహార్ తదుపరి సీఎం ఎవరు అనే దానిపై ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ హింట్ ఇచ్చారు. ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బీహార్‌ను బీజేపీ నేత సామ్రాట్ చౌదరే పర్యవేక్షిస్తారని చెప్పారు. ఆయన పాలనలో రాష్ట్రం కచ్చితంగా గణనీయమైన పురోగతిని సాధిస్తుందని ఆకాంక్షించారు. ఈ హింట్‌పై జేడియూ నేతలు భగ్గుమంటున్నారు. సామ్రాట్ చౌదరి పేరును ఎలా చెబుతారంటూ మండిపడుతున్నారు.