మంత్రి సవితను కలిసిన కూటమి నాయకులు
సత్యసాయి: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను పలువురు సందర్శకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు కలిశారు. ఈ సందర్భంగా వారు ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించిన వినతిపత్రాలు అందజేశారు. వాటిని శ్రద్ధగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.