సంజయ్‌ని కలిసిన బాసర యువకులు

నిర్మల్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్ధి బండి సంజయ్‌ని కరీంనగర్‌లోని ఆయన నివాసంలో బాసర వ్యాసపురి బ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షుడు సాయి, సూర్యతేజ, సంతోష్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువా కప్పి సరస్వతి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. రాబోయే ఎన్నికల్లో గెలిచి బాసర పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.