నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
SRPT: కోదాడ మండల పరిధిలోని గుడిబండ,అడ్లూరు గ్రామాల్లో ఇవాళ ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని కోదాడ మండల విద్యుత్ శాఖ ఏఈ సైదా మంగళవారం తెలిపారు. విద్యుత్ తీగలకు తగులుతున్న చెట్ల కొమ్మలను తొలగించే పనుల నేపథ్యంలో, ఆయా గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఆయన తెలిపారు.