డిగ్రీ కళాశాలను సందర్శించిన కలెక్టర్

డిగ్రీ కళాశాలను సందర్శించిన కలెక్టర్

JN: స్టేషన్ ఘనపూర్ డివిజన్ కేంద్రంలోని డిగ్రీ కళాశాలను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ గురువారం సందర్శించారు. ఆయన కళాశాల రికార్డులను పరిశీలించి, లెక్చరర్లకు పలు సూచనలు చేశారు. అనంతరం తరగతి గదుల్లోకి వెళ్ళి విద్యార్థులతో మాట్లాడారు. కలెక్టర్ వెంట ఆర్డీవో, ఇతర అధికారులు పాల్గొన్నారు.