క్రికెట్ స్టేడియాన్ని ప్రారంభించిన మంత్రి
RR: మణికొండ మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన క్రికెట్ స్టేడియాన్ని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిలతో కలిసి మంత్రి క్రికెట్ ఆడి సందడి చేశాడు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యువత క్రీడారంగంలో రాణించాలని అన్ని విధాలుగా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.