మద్యంపానంపై వైద్యుడు వినూత్న పోస్ట్
మద్యంపానంపై ఓ వైద్యుడు మందు బాబులకు వినూత్న రీతిలో అవగాహన కల్పించారు. 'ఆనందం కోసమని ఆల్కహాల్ తాగేవు, అల్సరొచ్చి అయ్యో రామా అనేవు. సరదాకని సారా కొట్టేవు.. సరసానికి పనికిరాకుండా పోయేవు. మందు మానరా.. మనిషివయ్యేవు. మత్తు వదలరా.. మహర్షివయ్యేవు' అంటూ ఆయన పెట్టిన పోస్ట్ SMలో వైరల్ కావడంతో.. ఇంత క్లారిటీగా చెప్పాక మందు తాగుతామా? మహాప్రభు అని కామెంట్స్ పెడుతున్నారు.