పుట్టిన రోజు నాడే యువకుడు మృతి
VSP: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పుట్టిన రోజు నాడే యువకుడు మృతి చెందిన ఘటన చినగదిలి BRTS రహదారిలో చోటుచేసుకుంది. గజపతినగర మండలానికి చెందిన కిరణ్ నగరంలోని హాస్టల్‌లో ఉంటూ పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. నిన్న తన పుట్టిన రోజు కావడంతో సాయంత్రం సింహాచలం అప్పన్నస్వామి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా తన బైక్‌ని వేరే ఒకరి బైక్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.