జిల్లాలో తగ్గిన కంటి సమస్య

జిల్లాలో తగ్గిన కంటి సమస్య

NGKL: జిల్లాలో 25 ఏండ్ల కిందట ఊర్లనే వేధించిన కంటి చూపు సమస్య ఇప్పుడు సగానికి పైగా తగ్గింది. గ్రామాలకు చేరువైన వైద్యం, హాస్పిటల్స్ అందిస్తున్న చికిత్సలు, ప్రజల్లో పెరిగిన అవగాహనతో కంటి చూపు సమస్యలు తగ్గాయని హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ కంటి హాస్పిటల్ డాక్టర్లు చేసిన రీసెంట్ స్టడీ తేల్చి చెప్పింది. అయితే వృద్ధులు, చదువుకోని వారిలో కంటి చూపు సమస్య ఇంకా తీవ్రంగానే ఉందన్నారు.