VIDEO: రెండు బైక్‌లు ఢీ.. వ్యక్తి మృతి
KKD: జగ్గంపేట NH-216పై ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. జగ్గంపేట (M) మర్రిపాకకు చెందిన కాపావరపు నూకపతి స్కూటీపై జగ్గంపేట వెళ్తుండగా అదే వైపుకు వెళ్తున్న గేద్దనాపల్లికి చెందిన వ్యక్తి బైక్‌తో వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో నూకపతి మృతి చెందగా, ఢీకొట్టిన వ్యక్తికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.