'ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి'

SRPT: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాల్సిన బాధ్యత ఉందని మున్సిపల్ కమిషనర్ మున్వర్ అలీ అన్నారు. మంగళవారం తిరుమలగిరిలోని 12,13 వార్డుల్లో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా వార్డు ప్రజలకు మొక్కలను పంపిణీ చేసి మాట్లాడారు. మొక్కలు మానవ మనుగడకు జీవనాధారమని, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలన్నారు.