ఎంపీ ఇంటిని ముట్టడించిన BRS
TG: ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ ఇంట్లోకి వెళ్లేందుకు బీఆర్‌ఎస్ నేతలు యత్నించారు. దీంతో ఎంపీ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో మాజీమంత్రి జోగు రామన్నతో పాటు కొంతమంది బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, పత్తి కొనుగోళ్ల పరిమితి పెంపు డిమాండ్‌తో BRS నేతలతో కలిసి ఆందోళనకు దిగినట్లు జోగు రామన్న వెల్లడించారు.