దశదినకర్మ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి

దశదినకర్మ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి

మహబూబ్ నగర్ రూరల్ మండలం అలిపూర్ గ్రామానికి చెందిన బాలయ్య గౌడ్ ఇటీవల మృతి చెందారు. ఈ క్రమంలో గురువారం నిర్వహించిన దశదినకర్మ కార్యక్రమానికి మాజీ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ గురువారం హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలయ్య గౌడ్ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.