నగర ప్రజలను వణికిస్తున్న చలి

నగర ప్రజలను వణికిస్తున్న చలి

హైదరాబాద్ మహా నగరంలో చలి తీవ్రత అధికంగా పెరుగుతోంది. జిల్లాలో శీతల గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో 7.5, హైదరాబాద్‌లో 10.8, దుండిగల్‌లో 10.7, హయత్ నగర్‌లో 11, హకీంపేట్‌లో 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు జిల్లా వాతావరణ శాఖ తెలిపింది. దీంతో నగర వాసులను చలి వణికిస్తోంది.