ప్రత్యేక అలంకరణలో స్వయంభు జంబుకేశ్వరుడు

ప్రత్యేక అలంకరణలో స్వయంభు జంబుకేశ్వరుడు

ATP: రాయదుర్గం పట్టణం కోటలో వెలిసిన స్వయంభు జంబుకేశ్వరుడు కమలా పుష్పాల ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చాడు. గురువారం పౌర్ణమి సందర్భంగా పురోహితులు రామకృష్ణ స్వామి మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమలా పుష్పాలతో స్వామి మూలవిరాట్‌ను విశేషంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం ప్రతిధ్వనించింది.