గర్భిణీ స్త్రీలకు పళ్ళు, డ్రై ఫ్రూట్స్ అందజేసిన సర్పంచ్
KKD: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి నెల 9న గర్భిణీ స్త్రీ కొరకు నిర్వహించు ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో జరుగుతుంది. ఈనెల క్రిస్టమస్ వేడుకలు సందర్భంగా కరప గ్రామ సర్పంచ్ సాదే ఆశాజ్యోతి కుమార్ దంపతులు గర్భిణీ స్త్రీలకు పళ్ళు, డ్రై ఫ్రూట్స్, బిస్కెట్స్ అందజేశారు. క్రిస్టమస్ వేడుకలు గర్భిణీ స్త్రీల సమక్షంలో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.