పులివెందులలో పాగా వేసిన కూటమి నేతలు

పులివెందులలో పాగా వేసిన కూటమి నేతలు

KDP: పులివెందుల ZPTC ఉప ఎన్నికలో విజయం సాధించి చరిత్ర తిరగరాయాలని కూటమి నేతలు ధృడ సంకల్పంతో బరిలోకి దిగినట్లు తెలుస్తోంది. దీనికి తగ్గట్లు జిల్లా TDP అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి, జమ్మలమడుగు MLA ఆదినారాయణ రెడ్డి పులివెందులలో పాగా వేశారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం నుంచి ప్రచారాన్ని మొదలు పెట్టారు. వైసీపీ కుటుంబాలను టీడీపీలో చేర్చుకుంటూ గెలుపుకు పావులు కదుపుతున్నారు.