యువకుడిని కాపాడిన పోలీసులు

ప్రకాశం: కొత్తపట్నం మండలం కె.పల్లెపాలెం సముద్ర తీరంలో ఆదివారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి స్నానానికి దిగిన ఒంగోలు సమతానగర్‌కు చెందిన మన్యం హేమంత్ అనే యువకుడు, అలల తాకిడికి సముద్రంలో కొట్టుకుపోయాడు. అదృష్టవశాత్తూ అటుగా వెళుతున్న మెరైన్ పోలీసులు గుర్తించి అతన్ని రక్షించారు. మద్యం మత్తులో స్పృహలో లేకపోవడంతో యువకుడిని కొత్తపట్నం ప్రాథమిక ఆరోగ్య తరలించారు.