అన్నదానానికి లక్ష రూపాయల విరాళం

అన్నదానానికి లక్ష రూపాయల విరాళం

BHNG: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో నిత్య అన్నదాన పథకానికి తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దంపతులు భారీ విరాళం అందజేశారు. సోమవారం స్వామివారిని దర్శించుకున్న అనంతరం రూ. 1,01,116 చెక్కును దేవస్థానం అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి ఆశీర్వచనాలు పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.