VIDEO: రాజ్యాంగం వల్లనే ఎదగగలుగుతున్నారు: MP
WGL: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే దళిత వర్గాలకు సమాన అవకాశాలు లభిస్తున్నాయని ఎంపీ కడియం కావ్య అన్నారు. రాజ్యాంగం కల్పించిన సమాన అవకాశాల కారణంగానే తాను దళిత బిడ్డగా పార్లమెంట్ స్థాయికి ఎదగగలిగానని ఆమె తెలిపారు. దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమాజం మరింత చైతన్యంతో ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.