VIDEO: 'అసెంబ్లీ ముట్టడిని విజయవంతం చేయాలి'
MNCL: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలలో భాగంగా 420 హమీలను నెరవేర్చడంలో విఫలమైందని మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 23న ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయలన్నారు.