'పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి చేస్తాం'

GNTR: గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్‌ను శుక్రవారం న్యాయవాదులు కలిశారు. పెండింగ్ కేసులకు త్వరగా ఛార్జ్‌షీట్లు దాఖలు చేసి, వాటిని వేగంగా పరిష్కరించాలని కోరారు. దీనిపై ఎస్పీ స్పందిస్తూ, పోలీసులు, న్యాయవాదుల సహకారంతో కేసుల పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో న్యాయవాదులు శ్రీనివాస్, సురేష్ బాబు, సుభాని, సందీప్ పాల్గొన్నారు.