సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ మంత్రి నాదెండ్ల

GNTR: తెనాలిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులను గురువారం మంత్రి నాదెండ్ల పంపిణీ చేశారు.అనారోగ్యంతో బాధపడుతున్న లబ్ధిదారులకు రూ.12,16,760 విలువైన చెక్కులను అందజేశారు. కూటమి ప్రభుత్వం నిరుపేద, అనారోగ్య బాధితులకు అండగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 222 మందికి రూ.2.76 కోట్లను సీఎం సహాయ నిధి నుంచి అందించామన్నారు