బస్సు బ్రేక్ ఫెయిల్.. తృటిలో తప్పిన ప్రమాదం..!
WNP: జిల్లాలోని ప్రయాణ ప్రాంగణంలో బస్సు ప్రమాదం తృటిలో తప్పింది. మంగళవారం వనపర్తి నుంచి హైదరాబాద్‌కు బస్సు బయలు దేరు క్రమంలో ఒక్కసారిగా బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో రోడ్డు మీదికి దూసుకెళ్ళింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును డివైడర్ వైపు మల్లించగా, డివైడర్‌ను తగలకముందే రోడ్డుపై నిలిచిపోయింది. ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు.