బస్టాండ్ నీటి గుంతలో పడిన మహిళా కానిస్టేబుల్
KMR: బస్టాండ్ వర్షం పడితే కుంటలా మారుతోంది. ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి బస్టాండ్ ఆవరణంలోకి నీరు చేరింది. విధి నిర్వహణలో ఉన్న మహిళా కానిస్టేబుల్ బస్టాండ్ నుంచి బయటకు వస్తూ గుంతలో పడిపోయింది. అక్కడున్న ప్రయాణికులు ఆమెను రక్షించారు. బస్టాండ్ నిర్వహణ తీరు, ప్రాంగణ దుస్థితిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.