క్యాబినెట్ భేటీకి ముందు పవన్‌ను కలిసిన మంత్రులు
AP: క్యాబినెట్ భేటీకి ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పలువురు మంత్రులు మర్యాదపూర్వకంగా కలిశారు. తమ నియోజకవర్గాల్లో రోడ్లకు నిధుల మంజూరుపై పవన్‌కు ధన్యవాదాలు తెలిపారు. డిప్యూటీ సీఎంను కలిసిన మంత్రుల్లో పయ్యావుల, అనిత, నారాయణ, నాదెండ్ల, డీఎస్‌బీవీ స్వామి, నిమ్మల, అనగాని, రాంప్రసాద్‌రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ ఉన్నారు.