నెటిజన్ల మనసు గెలుచుకున్న DC బ్యాటర్

నెటిజన్ల మనసు గెలుచుకున్న DC బ్యాటర్

ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతుండగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆట మధ్యలో ఓ కుక్క మైదానంలోకి రావడంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. ఆ సమయంలో బ్యాటింగ్ చేస్తున్న ఢిల్లీ బ్యాటర్ అభిషేక్ పోరెల్, ఆ మూగజీవాన్ని ఎంతో ప్రేమగా తన చేతుల్లోకి ఎత్తుకుని మైదానం బయట వదిలేసి వచ్చాడు. నోరులేని ఆ మూగజీవం పట్ల పోరెల్ చూపిన ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.