VIDEO: ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. పది మందికి తీవ్రగాయాలు
BHNG: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం జాతీయ రహదారిపై AP నిడదవోలు డిపో చెందిన బస్సు హైదరాబాద్‌కు వెళ్తుండగా కంటైనర్ లారీని వెనక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో పదిమంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా ముగ్గరు పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరిలించారు. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ఉన్నట్లు తెలస్తుంది.