'దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి'

'దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి'

TPT: సీపీఎం కార్యకర్తలపై దాడి చేసిన పెత్తందారులను కఠినంగా శిక్షించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కందారపు మురళి డిమాండ్ చేశారు. ఆదివారం సత్యవేడు సీఐ కార్యాలయం ఎదుట సీపీఎం నాయకులు ధర్నా నిర్వహించారు. మదనంబేడు గ్రామంలో సీపీఎం నాయకులు రమేష్, మునస్వామిపై దాడిని ఖండిస్తూ బాధితులకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం సీఐ మురళి నాయుడుకు వినతిపత్రం సమర్పించారు.