హత్య కేసులో 15 మందికి జీవిత ఖైదు
కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లిలో చేపల వేట వివాదంలో వ్యక్తిని హత్య చేసిన కేసులో 15 మందికి జిల్లా కోర్టు జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. 2019 ఏప్రిల్‌లో జరిగిన దాడిలో లక్ష్మణ్ అనే వ్యక్తి మృతి చెందగా, పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో జిల్లా జడ్జి శివకుమార్ నిందితులకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించారు.