గణేష్ మండపాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి: సీఐ

గణేష్ మండపాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి: సీఐ

KMM: మధిర, బోనకల్, ఎర్రుపాలెం మండలాల్లో గణేష్ మండపాలకు పోలీస్ శాఖ ముందస్తు అనుమతి తప్పనిసరని సీఐ మధు అన్నారు. స్థలదాత అంగీకార పత్రం, విద్యుత్ శాఖ అనుమతి పత్రాలు తప్పనిసరిగా ఆయా పోలీస్ స్టేషన్‌లో సమర్పించాలని చెప్పారు. అటు గణేష్ మండపాల వద్ద DJలకు అనుమతి లేదని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.