నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్
NZB: సాలూరు మండలంలోని సాలంపాడ్ క్యాంప్‌లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని బోధన్ సబ్ కలెక్టర్ గురువారం పరిశీలించారు. ఈ కేంద్రం సాలంపాడ్ క్యాంప్, సాలంపాడ్, కుమ్మన్పల్లి, కొప్పర్తి క్యాంప్, జాడి జామాల్పూర్, సాలూర క్యాంప్ గ్రామాలకు సంబంధించినది. నామినేషన్ దాఖలు చేసే సర్పంచ్, వార్డు సభ్యుల పత్రాల్లోని వివరాలను అభ్యర్థులకు చదివి వినిపించాలన్నారు.