కారు పార్కింగ్ విషయంలో ఘర్షణ
సత్యసాయి: కదిరి మండల కేంద్రంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కారు పార్కింగ్ విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. టిఫిన్ చేసేందుకు కార్ పార్కింగ్ చేసి వెళ్లిన కర్ణాటకకు చెందిన వ్యక్తులను, మరి కొందరు వచ్చి పార్కింగ్ నుంచి కారును తీయాలని అన్నారు. దీంతో మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలను అదుపులోకి తీసుకున్నారు.