సిర్పూర్ నుంచి మహారాష్ట్రకు బస్ సర్వీస్ ప్రారంభం

ASF: జిల్లా సిర్పూర్ మండలం నుండి మహారాష్ట్రలోని రాజురా వెళ్లే మహారాష్ట్ర RTC బస్ సర్వీస్ బుధవారం పున:ప్రారంభించారు. గతంలో బస్ సర్వీస్‌ను వివిధ కారణాల వల్ల నిలిపివేశారు. దీంతో సరిహద్దులోని మహారాష్ట్రకు వెళ్లాలనుకునే ప్రజలు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించడంతో వారిపై ఆర్థిక భారం పడేది. బస్ మళ్ళీ ప్రారంభ కావడంతో సిర్పూర్ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.