'రేపు ఇసుక బహిరంగ వేలం'

'రేపు ఇసుక బహిరంగ వేలం'

MDK: రామాయంపేట మండల కేంద్రంలో ఉన్న అక్రమ ఇసుకను బుధవారం బహిరంగ వేలం వేయనున్నట్లు తహసీల్దార్ ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 30న మైన్స్ అండ్ జియాలజీ అధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టి, సుమారు 18 ట్రాక్టర్ల ఇసుకను అధికారులు సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న ఈ ఇసుక నిల్వలకు ఉదయం 11:30 గంటలకు తహసీల్దార్ కార్యాలయంలో వేలం నిర్వహించనున్నారు.