బాధితులకు సత్వర న్యాయం అందించాలి: ఎస్పీ

బాధితులకు సత్వర న్యాయం అందించాలి: ఎస్పీ

సూర్యాపేట పోలీస్ గ్రీవెన్స్‌కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఎస్పీ నరసింహ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘ప్రజావాణి’ నిర్వహించి 6 వినతులు స్వీకరించారు. కేసుల విచారణలో పారదర్శకత ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. బాధితుల సమస్యల పరిష్కారాన్ని నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు.